breaking news
nagender reddy
-
‘కొద్దిలో మిస్సయ్యాడు.. నేనైతే వేసేసేవాడిని’
కుత్బుల్లాపూర్: కాల్పుల ఘటనలో సూత్రధారి నోటి దురుసు వల్లే హత్యకు గురయ్యాడని పోలీసులు వెల్లడించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన రియల్టర్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ అందె శ్రీనివాస్ రావు వెల్లడించిన వివరాలు.. కుత్బుల్లాపూర్ పద్మానగర్‌కు చెందిన శైలేందర్ కుమార్ అలియాస్ చక్రవర్తికి బాపూనగర్‌కు చెందిన మందాడి నాగేందర్‌రెడ్డికి మధ్య రియల్ ఎస్టేట్ రంగంలో విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2016 నవంబర్ 16న చక్రవర్తి అతని అనుచరుడు సాయి ప్రభు అలియాస్ తేజ కలిసి తుపాకితో నాగేందర్ రెడ్డిపై కాల్పులకు తెగబడ్డారు. తృటిలో ప్రాణాప్రాయం నుంచి నాగేందర్ రెడ్డి తప్పించుకోగా సాయి ప్రభు పట్టుబడ్డాడు. దీంతో సూత్రధారి చక్రవర్తి పరారీలో ఉండగా పోలీసులు పట్టుకుని డిసెంబర్ 22వ తేదిన రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన చక్రవర్తి నాగేందర్‌రెడ్డిని వదిలేది లేదంటూ బహిరంగంగానే సవాల్ విసిరుతూ వస్తున్నాడు. ఇది తెలుసుకున్న నాగేందర్‌రెడ్డికి ప్రాణ భయం పట్టుకుంది. దీంతో వాజ్పాయ్ నగర్‌కు చెందిన కట్ట నాగయ్య(24), కుంట రవి(29)లకు రూ.2 లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పుకుని చక్రవర్తిని చంపేందుకు సిద్దమయ్యారు. అదను కోసం వేచి చూస్తుండగా శుక్రవారం రాత్రి పద్మానగర్ చాయిస్ ఫ్యాక్టరీ దగ్గర ఓ ప్లాట్ విషయంలో ముగ్గురితో మాట్లాడుతున్న చక్రవర్తిని గుర్తించి రాడ్డు, కత్తులతో దాడి చేసి హతమార్చారు. మధ్యాహ్నమే కౌన్సిలింగ్..అంతలోనే హత్య.. బెయిల్‌పై విడుదలై వచ్చినప్పటి నుంచి చక్రవర్తి ‘కొద్దిలో నాగేందర్‌రెడ్డి మిస్ అయ్యాడు.. నేనైతే వేసేసే వాడిని’ అంటూ పబ్లిక్‌గా చెప్పుకుంటున్నాడు. ఈ ప్రాంతానికి నేనే డాన్ అంటూ చెప్పుకుంటున్న చక్రవర్తి.. నాగేందర్‌రెడ్డి తన నుంచి తప్పించుకోలేడంటూ, ఎదురు తిరిగితే ఊరుకోనంటూ పద్మానగర్ రింగ్ రోడ్డు వద్ద బెదిరింపులకు దిగుతున్నాడు. ఇది తెలుసుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. చక్రవర్తి కదలికలపై కట్ట నాగయ్య, కుంట రవి కన్నేసి ఉంచారు. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ వద్దే ఉన్న వారిద్దరూ.. స్టేషన్ నుంచి చక్రవర్తి బయటకు రాగానే హత్య చేసేందుకు పథకం పన్నారు. అయితే, వారి కళ్లుగప్పి చక్రవర్తి వెళ్లిపోయాడు. దీంతో అతని ఆచూకీని కనిపెడుతూ వస్తున్న నాగేందర్‌రెడ్డి తన అనుచరులకు ఒంటరిగా ఉన్న చక్రవర్తి కనిపించాడు. వెంటనే క్షణాల్లో అతనిపై దాడి చేసి విచక్షణా రహితంగా రాడ్డుతో కొట్టి కత్తుల పొడిచి ఘటన స్థలంలో సుమారు 45 నిమిషాలు ఎవరిని రాకుండా పోలీసులు వచ్చేంత వరకు ఉండి లొంగిపోయారు. రాబోయే రోజుల్లో ఈ గ్రూపు తగాదాలు ఎంత వరకు దారి తీస్తాయోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు
-
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు
పేట్ బషీరాబాద్ ప్రాంతంలో ఘటన హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. పేట్‌బషీరాబాద్ బాపూనగర్‌కు చెందిన నాగేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వాజ్‌పేరుు నగర్‌కు చెందిన తేజ గత 3 నెలల నుంచి ఓ స్థల వివాదంలో నాగేందర్ రెడ్డితో వాగ్యుద్ధానికి దిగసాగాడు. ఈ క్రమంలోనే తేజ బుధవారం రాత్రి 10.45 గంటలకు బాపూనగర్‌లోని నాగేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి, రివాల్వర్‌ను ఆయన తలపై గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. దీన్ని తప్పించుకునే క్రమంలో నాగేందర్‌రెడ్డికి వెన్నులో బుల్లెట్ దిగింది. రెండో బుల్లెట్ మిస్‌ఫైర్ అరుుంది. నాగేందర్‌రెడ్డి అరవడంతో స్థానికులు తేజను పట్టుకొని పేట్‌బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. నాగేందర్‌రెడ్డి అపస్మారక స్థితికి చేరడంతో దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు తేజను అదుపులోకి తీసుకుని కాల్పుల ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారిస్తున్నారు. -
ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ అధ్యక్షునిగా నాగేందర్‌రెడ్డి
రాయికల్: ఓవర్సిస్ ఫ్రెండ్స్ ఆఫ్ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షునిగా కరీంనగర్ జిల్లా వాసి నియమించబడ్డారు. ఎలిగేడు మండలం ర్యాంకర్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన కాసర్ల నాగేందర్‌రెడ్డిని నియమించినట్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ కవిత మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ..త్వరలోనే పూర్తి కమిటీని ప్రకటిస్తామన్నారు. ఆస్ట్రేలియాలో పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానని... తన నియామకానికి కృషి చేసిన ఎంపీ కవితకు నాగేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.