పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ బుర్రాబజార్‌లో అంటుకున్న మంటలు చూస్తుండగానే భారీగా విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైరింజన్లతో ఏడెనిమిది గంటలపాటు శ్రమించి మంటలు ఆర్పివేశారు.