సెంట్రల్ యూనివర్సిటీలో జింక కాల్చివేత | Deer Shot in Hyderabad Central University | Sakshi
Sakshi News home page

Jan 4 2016 7:08 AM | Updated on Mar 22 2024 11:30 AM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) షూటింగ్ రేంజ్‌లో కోచ్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి జింక (వన్య మృగం)ను వేటాడాడు. తుపాకీతో కాల్చి చంపాడు. తల వేరు చేసి, చర్మం వలిచి, మాంసం ఓ గదిలో దాచి పెట్టారు. షూటింగ్ ప్రాక్టీస్‌కు వచ్చిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో గుట్టురట్టయ్యింది. తుపాకీతో కాల్చి వేటాడినట్లు గచ్చిబౌలి పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ జె.రమేశ్ కుమార్ కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు జింకను కోసి, గదిలో దాచారని పోలీసులకు సమాచారం అందింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement