ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తున్న యాదాద్రి దివ్యక్షేత్రం అభివృద్ధి పనుల్లో వాస్తుదోషాలను సరిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పరిశీలించారు. ముందుగా ప్రధాన ఆలయానికి చేరుకున్న సీఎంకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం సీఎం కొండపైన జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీ లించారు. గర్భగుడి, ఆంజనేయస్వామి ఆలయాలను కదిలించకుండా అభివృద్ధి పనులను చేయాలని సూచించారు.