ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశమూ చేపట్టని అనూహ్యచర్యకు చైనా ఉపక్రమించింది. అణుశక్తితో దాడులు చేయగల భారీ జలాంతర్గామిని మొట్టమొదటిసారి ప్రదర్శనకు ఉంచనుంది. తద్వారా తన నౌకాదళ సామర్థ్యాన్ని చాటి చెప్పాలనుకుంటున్నది. స్వదేశీ పరిజ్ఞానంతో తాయరుచేసిన యుద్ధవాహక నౌకను కూడా తన ప్రజలకు చూపనుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కీలక ప్లీనం జరగడానికి కొద్ది రోజుల ముందే చైనీస్ నేవీ తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించనుండటం గమనార్హం.