దాడి కేసులో చింతమనేనిపై కేసు నమోదు | case filed against TDP mla chintamaneni prabhakar | Sakshi
Sakshi News home page

Dec 24 2016 7:27 AM | Updated on Mar 21 2024 8:55 PM

జర్నలిస్టుపై దాడి ఘటనలో ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెలే చింతమనేని ప్రభాకర్‌ పై కేసు నమోదైంది. జర్నలిస్టుల ఫిర్యాదుమేరకు టీడీపీ నేత చింతమనేనితో పాటు మరో ఇద్దరిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐసీసీ 323, 394, 406, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదయింది. జర్నలిస్టులపై చింతమనేని దాడి చేయడాన్ని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ ఫోరం, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఖండించారు. చింతమనేని అరెస్ట్ చేయాలని కోరుతూ దశలవారిగా ఉద్యమం చేపట్టాలని జర్నలిస్టులు నిర్ణయించారు. రిపోర్టర్‌పై దాడిని వ్యతిరేకిస్తూ గురువారం ఆందోళన చేసిన జర్నలిస్టులు శుక్రవారం ఏలూరు త్రీటౌన్ పీఎస్ ఎదుట ధర్నా చేపట్టారు. డీపీఆర్ఓ ఆఫీస్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ఎన్ రాజు, రాష్ట్ర కార్యదర్శి రఘురాం, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు కె.మాణిక్యారవు, తదితరులు పాల్గొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement