breaking news
reporter attacked
-
దాడి కేసులో చింతమనేనిపై కేసు నమోదు
-
దాడి కేసులో చింతమనేనిపై కేసు నమోదు
ఏలూరు: జర్నలిస్టుపై దాడి ఘటనలో ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెలే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదైంది. జర్నలిస్టుల ఫిర్యాదుమేరకు టీడీపీ నేత చింతమనేనితో పాటు మరో ఇద్దరిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐసీసీ 323, 394, 406, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదయింది. జర్నలిస్టులపై చింతమనేని దాడి చేయడాన్ని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ ఫోరం, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఖండించారు. చింతమనేని అరెస్ట్ చేయాలని కోరుతూ దశలవారిగా ఉద్యమం చేపట్టాలని జర్నలిస్టులు నిర్ణయించారు. రిపోర్టర్‌పై దాడిని వ్యతిరేకిస్తూ గురువారం ఆందోళన చేసిన జర్నలిస్టులు శుక్రవారం ఏలూరు త్రీటౌన్ పీఎస్ ఎదుట ధర్నా చేపట్టారు. డీపీఆర్ఓ ఆఫీస్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ఎన్ రాజు, రాష్ట్ర కార్యదర్శి రఘురాం, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు కె.మాణిక్యారవు, తదితరులు పాల్గొన్నారు. గత బుధవారం వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుండగా అక్కడికి వచ్చిన చింతమనేని వారిపై చిందులు తొక్కారు. మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తానంటూ హెచ్చరిస్తుండగా అక్కడే ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి, ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కడవకొల్లు సాగర్ ఈ తతంగాన్ని సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండటంతో చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జర్నలిస్టులపై దాడికి దిగిన విషయం తెలిసిందే. గతంలోనూ కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దౌర్జన్యం.. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీ శాఖ అధికారిపై దాడి.. ఐసీడీఎస్ అధికారులకు బెదిరింపులు.. ఏలూరు టూటౌన్‌పోలీస్ స్టేషన్‌పై దాడికెళ్లినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోవడం.. పోలీస్ కానిస్టేబుల్‌ను చితక్కొట్టడం.. ఇలా ఎన్నో పర్యాయాలు చింతనేని దాడులకు పాల్పడ్డారని జర్నలిస్టులు మండిపడుతున్నారు. -
లైవ్ రిపోర్టింగ్ లో మహిళా జర్నలిస్ట్ పై దాడి!
వాషింగ్టన్: అమెరికాలో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టుపై దాడి జరిగింది. ఫిలడెల్ఫియాలోని ఓ ప్రైవేట్ చానల్ మహిళా రిపోర్టర్ పై దాడి చేసిన మహిళపై అందరూ మండిపడుతున్నారు. రెండు రోజుల కిందట సిటీ హాల్ లో లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని టెలిముండో ఆఫీస్ వారు తెలిపారు. ఐరిస్ డెల్గాడో గత కొన్నేళ్లుగా జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తోంది. సిటీ హాల్ లో డెల్గాడో టీవీ లైవ్ షోలో భాగంగా రిపోర్టింగ్ చేస్తోంది. ఇంతలో వాహిదా విల్సన్ అనే మహిళా అక్కడికి వచ్చి డెల్గాడోపై దాడి చేయడం ప్రారంభించింది. మహిళా జర్నలిస్ట్ తల, ముఖం భాగాలపై విల్సన్ అకస్మాత్తుగా దాడి చేసింది. చేతిని అడ్డు పెట్టుకుని ఏం జరిగింది, ఎందుకిలా చేస్తున్నావంటూ బాధితురాలు అడుగుతున్నా పట్టించుకోలేదు. విల్సన్ దాడి చేయడం ప్రారంభించగానే టీవీ చానల్ లో లైవ్ రికార్డింగ్ ఆపేశారు. యాంకర్ రామన్ జయాస్ ఈ విషయాన్ని గమనించి ఓ మై గాడ్ ఇలా జరిగిందేంటని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. వహీదా విల్సన్ ను అరెస్ట్ చేసినట్లు ఫిలడెల్ఫియా జిల్లా ఉన్నతాధికారి వెల్లడించారు. వీడియో సాక్షాల ఆధారంగా మహిళను అరెస్ట్ చేశామని, ఆన్ లైన్ కోర్టు డాక్యుమెంట్లలో విల్సన్ వల్ల ఇతరులకు ప్రాణహాని ఉందని పేర్కొన్నట్లు చెప్పారు. మహిళా జర్నలిస్ట్ డెల్గాడో చికిత్స తీసుకుంది. ఆమె కోలుకోవడానికి కొన్ని రోజులు సమయం పడుతుందని టీవీ చానల్ వారు తెలిపారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు.