యువకుడిని ఢీకొన్న బెల్లంకొండ కారు | Sakshi
Sakshi News home page

యువకుడిని ఢీకొన్న బెల్లంకొండ కారు

Published Fri, Apr 24 2015 3:58 PM

ఫిలింనగర్ లోని రోడ్ నెంబర్ 7లో ఓ యువకుడిని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారు ఢీకొంది. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అతడు ఫిలింనగర్ బస్తీకి చెందినవాడుగా గుర్తించారు. అదుపు తప్పిన కారు జనం మీదకు దూసుకెళ్లిపోయింది. అందులో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. బెల్లంకొండ సురేష్ కార్యాలయంపై దాడి చేశారు. ఆయన కార్యలయానికి ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. కాగా, ఈ ఘటన జరిగిన వెంటనే కారు నడుపుతున్న డ్రైవర్ మాత్రం పరారైపోయినట్లు తెలిసింది. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో కారు డ్రైవర్పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

Advertisement