ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై బదిలీ వేటు | AP intelligence chief anuradha transferred | Sakshi
Sakshi News home page

Jul 6 2015 12:20 PM | Updated on Mar 22 2024 10:56 AM

ఓటుకు కోట్లు కేసు ప్రభావం ఏపీ ఐపీఎస్ అధికారులపైన పడింది. ఏపీ నిఘా విభాగం చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధపై బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో విజయవాడ కమిషనర్ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్గా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. మరోవైపు అనురాధను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీగా బదిలీ చేశారు. అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్గా గౌతం సవాంగ్ నియమితులయ్యారు. కాగా ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ అడ్డంగా దొరికిన వీడియోలు, ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటపడిన వ్యవహారం ముందుగా పసిగట్టి సమాచారం ఇవ్వడంలో వైఫల్యం చెందారనే సాకుతో అనురాధను తప్పించినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ఇంటెలిజెన్స్ అధికారులపై అసంతృప్తిగా ఉన్నారు. దాంతో అనుకున్నట్లుగానే ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై బదిలీ వేటు పడింది.

Advertisement
 
Advertisement
Advertisement