ఎపి ఎన్జీఓ నేతలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏలూరులోని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసాన్ని ముట్టడించారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రం ముక్కలు కావడంలో కావూరి పాత్ర ఉందని ఆరోపించారు. కావూరి రాజీనామా చేయాలి, కావూరి డౌన్ డౌన్.... అంటూ నినాదాలు చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రాము ఆద్వర్యంలో కాంగ్రెస్ నేతలు ప్రవేశించి ఎపి ఎన్జీఓ నేతలు, వైఎస్సార్ సిపి నేతలపై దౌర్జన్యానికి దిగారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఎపి ఎన్జీఓ నేతలను ఉద్దేశించి దొంగలగా విమర్శించడంతో వివాదం ముదిరింది. మరోవైపు వైఎస్సార్ సిపి నేతలు, కాంగ్రెస్ నేతలు పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్ధితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. కావూరి రాజీనామా కోరుతూ ధర్నాకు దిగిన వైఎస్సార్ సిపి నేతలు, ఎన్జీఓ నేతలపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావూరి రాజీనామా చేయకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని సమైక్యాంధ్రవాదులు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసి భారీ ర్యాలీ చేపట్టింది. సోనియా గాంధీ, కేసిఆర్, సిఎం దిష్టి బొమ్మలను దహనం చేశారు. సోనియా గాంధీ, కేసిఆర్, సిఎం కిరణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Jul 31 2013 2:56 PM | Updated on Mar 22 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement