పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్, సెన్సెక్స్ 407 పాయింట్ల లాభం | Sensex soars 407 pts on value buying metal stocks lead | Sakshi
Sakshi News home page

Aug 22 2013 5:31 PM | Updated on Mar 21 2024 8:40 PM

నాలుగు రోజుల వరుస నష్టాలకు తెర దించుతూ భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాల్ని నమోదు చేసుకున్నాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 407 పాయింట్లు లాభపడి 17759 వద్ద, నిఫ్టీ 105 పాయింట్ల వృద్ధితో 5408 వద్ద ముగిసాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడటం గత రెండు నెలల్లో ఇదే తొలిసారి. చైనా మానుఫాక్చరింగ్ డేటా, యూరోపియన్ మార్కెట్లలో సానుకూలత భారీ కొనుగోళ్లకు ఊతమిచ్చింది. రూపాయి పతన ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపకపోవడం నేటి మార్కెట్ లో విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి (65.50) మరో చారిత్రాత్మక కనిష్టాన్ని నమోదు చేసుకుంది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో రాన్ బాక్సీ లాబ్స్ 16 శాతానికి పైగా, సెసా గోవా 13.31, హిందాల్కో 11.47, టాటా స్టీల్ 10.46 జయప్రకాశ్ అసోసియేట్స్ 9.72 శాతం లాభపడ్డాయి. డీఎల్ఎఫ్, హెచ్ డీ ఎఫ్ సీ, యాక్సీస్ బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, ఏసీసీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement