దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంచనాలకు అనుగుణంగానుఏ అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును చేపట్టడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగాయి. ఫెడ్ వడ్డీ రేటును పావు శాతం పెంచడంతోపాటు ఇకపై రెండేళ్లపాటు ఏడాదికి కనీసం మూడుసార్లు రేట్లను పెంచే వీలున్నట్లు సంకేతమివ్వడంతో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు.