యథాతథంగా జపాన్ కీలక వడ్డీరేట్లు | Sakshi
Sakshi News home page

యథాతథంగా జపాన్ కీలక వడ్డీరేట్లు

Published Tue, Nov 1 2016 4:36 PM

జపాన్ కేంద్ర బ్యాంకు బ్యాంక్ ఆఫ్ జపాన్ (బీఓజే) కీలక వడ్డీరేట్ల నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న మైనస్ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలకనుగుణంగానే -0.1శాతం స్వల్ప-కాల వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించింది. దీంతోపాటుగా 2017, 2018 ఆర్థిక సంవత్సరాలకు గాను స్థిరమైన విధానం అమలుతో పాటు ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని మరింత పొడిగించింది. విదేశాలనుంచి డిమాండ్ క్షీణత తోపాటు, ప్రజల ఆర్థిక కార్యకలాపాల బలహీనత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ కొనసాగుతుందనిపేర్కొంది. ప్రస్తుత మందకొడితనం స్వల్పంగా మెరుగుపడి ఎగుమతులు, వినియోగం మధ్యస్తంగా పెరగనుందని అంచనావేసింది

Advertisement
Advertisement