పుత్తాకు శృంగభంగం! | - | Sakshi
Sakshi News home page

పుత్తాకు శృంగభంగం!

Nov 30 2026 2:04 AM | Updated on Nov 30 2026 2:04 AM

● కోగటంలో స్వయంగా ప్రచారం చేసినా ఒక్క వార్డు కూడా దక్కని వైనం

● చెన్నూరు, దుగ్గాయపల్లె, కొప్పోలులో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విజయం

● చెన్నూరు, దుగ్గాయపల్లె, కొప్పోలు సైతం..

చెన్నూరులో మాజీ మండలాధ్యక్షుడు శివరామిరెడ్డి తనయుడు దినేష్‌రెడ్డి సర్పంచ్‌గా పోటీ చేయగా, ఎమ్మెల్యే పుత్తా సమీప బంధువు శ్రీకాంత్‌రెడ్డి తలపడ్డారు. మేజర్‌ పంచాయతీ చెన్నూరును కైవసం చేసుకోవాలని ‘పుత్తా’ వారు విస్తృతంగా యత్నించారు. ఎన్నికల నియామవళి ఆంక్షలు సైతం విస్మరించి శనివారం రాత్రి పొద్దుపోయే వరకూ చెన్నూరులో తిష్టవేశారు. నిష్పక్షపాత పోలింగ్‌లో 20వార్డులకు పుత్తా వర్గీయులు 8, వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు శివరామిరెడ్డి వర్గీయులు 12 వార్డులు గెలుచుకున్నారు. సర్పంచ్‌ అభ్యర్థి దినేష్‌రెడ్డి 1194 మెజార్టీతో ఘనవిజయం సాధించారు. అలాగే పుత్తా స్వగ్రామం మాచిరెడ్డిపల్లెకు పొరుగున్నే ఉన్న దుగ్గాయపల్లెలో సైతం టీడీపీ మద్దతుదారులను గెలిపించుకోవాలని యత్నించారు. అక్కడ వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కృష్ణమూర్తి 494ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొప్పోలు కూడా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు శ్రీకాంత్‌రెడ్డి 308ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. పతిష్టాత్మకంగా తీసుకున్న మూడు సర్పంచ్‌ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన అభ్యర్థులు ఘన విజయం సాధించడం విశేషం.

సాక్షి ప్రతినిధి, కడప: రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్‌ పుత్తా నరసింహారెడ్డికి శృంగభంగం తప్పలేదు. కోగటంలో స్వయంగా ప్రచారం నిర్వహించినా కనీసం ఒక్కవార్డును కూడా గెలిపించుకోలేకపోయారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెన్నూరు, దుగ్గాయపల్లె, కొప్పోలు పంచాయతీల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు.

జెడ్పీ చైర్మన్‌ పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తమ సొంత నియోజకవర్గంలో పరాభవం ఎదుర్కొన్నారు. కమలాపురంలో 96పంచాయతీలకు గాను, 59 పంచాయతీలు పోలీసులను అడ్డుపెట్టుకొని బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారు. కోర్టు ఉత్తర్వులు కారణంగా 3 చోట్ల ఎన్నికలు నిలిచిపోగా, 34 పంచాయతీల్లో పోలింగ్‌ అనివార్యమైంది. వాటిలో ప్రధా నంగా కోగటం, దుగ్గాయపల్లె, కొప్పోలు, చెన్నూరు పంచాయతీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కోగటంలో జెడ్పీ చైర్మన్‌ పుత్తా నరసింహారెడ్డి స్వయంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఒక్కటంటే ఒక్కవార్డు కూడా విజయం సాధించలేకపోయారు. 12వార్డులు, సర్పంచ్‌ స్థానాన్ని గండ్లూరు బ్రదర్స్‌ కై వసం చేసుకొని పుత్తాకు సవాల్‌గా నిలిచారు. అలాగే నియోజకవర్గంలో 19పంచాయతీలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, 14 చోట్ల టీడీపీ మద్దతుదారులు, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

వీరశివా సవాల్‌ తగ్గట్లుగానే... కోగటంలో పుత్తా వర్గీయులు ఒక్కవార్డు గెలుచుకున్నా రాజకీయ సన్యా సం స్వీకరిస్తానని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సవాల్‌ విసిరారు. అందుకు తగ్గట్లుగా 12వార్డులు గండ్లూరు బ్రదర్స్‌ కైవసం చేసుకున్నారు. సర్పంచ్‌గాపద్మావతమ్మ 1,502 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement