రేవా లీగల్ స్టడీస్ మ్యాగజైన్‌లో రాజంపేట విద్యార్థిని కథనం
ప్రచురితమైన కథనాన్ని చూపుతున్న రక్కాసి దీపికారెడ్డి
రేవా స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్ మ్యాగజైన్
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తనకున్న అభిమానాన్ని లా విద్యార్థిని అక్షరరూపంలో చాటుకుంది. రాజంపేట పురపాలక సంఘం కౌన్సిలర్ రక్కాసి శ్రీవాణి కుమార్తె రక్కాసి దీపికారెడ్డి బెంగళూరులోని రేవా లా కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి నుంచి వైఎస్ జగన్ అంటే ఎనలేని అభిమానం ఉన్న ఆమె, ఆయనను ప్రజల మనిషిగా, ఆదర్శవంతునిగా పేర్కొంటూ ఒక ప్రత్యేక కథనాన్ని రాసింది. వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం, పదవులు, అధికారం తదితర అంశాలను విశ్లేషిస్తూ దీపికారెడ్డి రూపొందించిన ఈ కథనం బెంగళూరులోని’ రేవా స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్’ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది.
–రాజంపేట


