ఉత్సాహంగా మ్యాథ్‌ ‘బి’ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా మ్యాథ్‌ ‘బి’

Nov 30 2026 1:52 AM | Updated on Nov 30 2026 1:52 AM

● లెక్కల భయాన్ని పోగొట్టిన కాంపిటీషన్‌

● విద్యార్థుల నుంచి విశేష స్పందన

లెక్కలంటే చాలా మంది ఆమడదూరం పరుగెడుతుంటారు. అయితే లెక్కలంటే భయం వద్దని చెబుతూ

సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యాథ్‌ ‘బి’ కాంపిటీషన్‌ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా

సాగింది. ఆదివారం కడప నగరం జీఎంఆర్‌

పాఠశాలలో నిర్వహించిన రెండోరౌండ్‌ మ్యాథ్‌ ‘బి’ కాంపిటీషన్‌కు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభించింది.

కడప ఎడ్యుకేషన్‌ : లెక్కలంటే అన్నీ చిక్కులే.. కొందరికి అదో బ్రహ్మపదార్థం. అర్థం చేసుకున్న వారికి మాత్రం ఆసక్తికరం. చిన్న వయసులో నేర్చుకునే చిట్కాలు జీవితాంతం గుర్తుండిపోతాయనేది నిపుణుల మాట. విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి.. వారిలో ఆసక్తి పెంచేలా.. చిన్న చిన్న సమస్యలు మొదలు.. వారి స్థాయిని అనుసరించి నిర్వహించిన సాక్షి మ్యాథ్‌ ‘బి’ కాంపిటీషన్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. కడప నగరంలోని జీఎంఆర్‌ స్కూల్‌లో నిర్వహించిన మ్యాథ్‌ ‘బి’ రెండో రౌండ్‌ కాంపిటీషన్‌ను ఆదివారం నాలుగు కేటగిరీలుగా నిర్వహించారు. ఇందులో కేటగిరీ–1లో 1, 2 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4 తరగతుల వారు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్‌ను సాక్షి బ్రాంచ్‌ మేనేజర్‌ హరినాథరెడ్డి, అడ్వర్‌టైజ్‌మెంట్‌ రీజినల్‌ మేనేజర్‌ సుబ్బారెడ్డి, జిల్లా మేనేజర్‌ చాముండేశ్వరి పర్యవేక్షించారు.కాగా ఈ కాంపిటీషన్‌లో కడపకు చెందిన శివశివానీ స్కూల్‌, కడప పబ్లిక్‌ స్కూల్‌, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, జీఎంఆర్‌ఎ స్కూల్‌, మోంట్‌పోర్టు స్కూల్‌, వేంపల్లె చైతన్య స్కూల్‌, సింహాద్రిపురం గురజాల నేతాజి స్కూల్‌ విద్యార్థులు హాజరై కాంపిటీషన్‌లో తమ ప్రతిభను పరీక్షించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement