డ్రాగా ముగిసిన ఆంధ్ర– మధ్యప్రదేశ్‌ మ్యాచ్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రాగా ముగిసిన ఆంధ్ర– మధ్యప్రదేశ్‌ మ్యాచ్‌

Nov 30 2026 1:52 AM | Updated on Nov 30 2026 1:52 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : స్థానిక వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో ఆంధ్ర, మధ్యప్రదేశ్‌ జట్ల మధ్య జరిగిన కూచ్‌ బెహార్‌ ట్రోఫీ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన ఆధిక్యంతో మధ్యప్రదేశ్‌ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులు చేయగా, బదులుగా మధ్యప్రదేశ్‌ 324 పరుగులు చేసి 81 పరుగుల కీలక ఆధిక్యాన్ని అందుకుంది.అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్ర.. 192/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆఖరి రోజు ఆటను కొనసాగించి 95.1 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బ్యాటర్లలో దేవ్‌ ప్రమోద్‌ (113) అద్భుత సెంచరీతో కదం తొక్కగా, సాయి నందకిషోర్‌ (71), ఎన్‌. రాజేష్‌ (43 నాటౌట్‌) రాణించారు. మధ్యప్రదేశ్‌ బౌలర్‌ సాజన్‌ దహయాత్‌ ఆరు వికెట్లతో ఆంధ్ర పతనాన్ని శాసించాడు. యువరాజ్‌ సింగ్‌, చౌహన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 226 పరుగుల లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌.. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి 51 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. వర్మ (46), కుషాగ్రా నగర్‌ (39) రాణించారు. ఆంధ్ర బౌలర్‌ శ్రీచరణ్‌ రెండు వికెట్లు తీశాడు. ఆట సమయం ముగియడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.

113 పరుగులు చేసిన దేవ్‌ ప్రమోద్‌

71 పరుగులు చేసిన సాయి నందకిషోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement