పోటీ పరీక్షలకు పునాది.. | - | Sakshi
Sakshi News home page

పోటీ పరీక్షలకు పునాది..

Nov 30 2026 1:52 AM | Updated on Nov 30 2026 1:52 AM

సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యాథ్‌ ‘బీ’, స్పెల్‌ ‘బీ’కాంపిటీషన్స్‌లో పాల్గొంటున్నాను. భవిష్యత్తులో రాసే పోటీ పరీక్షలకు (కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌) ఇవి మంచి పునాదిగా ఉపయోగపడతాయి. ఇచ్చిన మెటీరియల్‌ను బాగా సాధన చేశాను. ఫైనల్‌ వరకు వెళ్లడమే నా లక్ష్యం.

– ధన్య, మోంట్‌ఫోర్ట్‌ స్కూల్‌, కడప

ఇంగ్లీషుపై ఆసక్తి పెరిగింది..

‘సాక్షి’నిర్వహిస్తున్న స్పెల్‌ ‘బీ’కాంపిటీషన్‌లో రెండోసారి పాల్గొంటున్నాను. ఈ పోటీల కోసం స్పెల్లింగ్స్‌ బాగా నేర్చుకున్నాను. దీనివల్ల నాకు ఇంగ్లీషు సబ్జెక్టుపై మరింత ఆసక్తి పెరిగింది.

– వి. శివాంక్‌రెడ్డి,

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, కడప

విజేతగా నిలవాలని..

గత మూడు సంవత్సరాలుగా స్పెల్‌ ‘బీ’కాంపిటీషన్‌లో పాల్గొంటున్నాను. ఇప్పటివరకు ప్రతిసారీ అన్ని రౌండ్లలో అర్హత సాధిస్తూ ఫైనల్స్‌ వరకు వెళ్లగలిగాను. ఈ ఏడాది స్పెల్‌ ‘బీ’విజేతగా నిలవాలన్న లక్ష్యంతో బాగా సన్నద్ధమయ్యాను.

– పి. వినయశ్రీ,

నాగార్జున మోడల్‌ స్కూల్‌, కడప

తెలియనివి ఎన్నో నేర్చుకున్నా..

స్పెల్‌ ‘బీ’కాంపిటీషన్‌ కోసం ఇచ్చిన స్టడీ మెటీరియల్‌ను పూర్తిగా చదువుకున్నాను. దీని ద్వారా ఎన్నో కొత్త పదాలకు స్పెల్లింగ్స్‌, అర్థాలు తెలుసుకున్నాను. పోటీల నిర్వహణ చాలా బాగుంది. నాలో ఆంగ్లం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి ఆసక్తిని కలిగించింది.

– చైతన్‌, జీఆర్‌టీ జీవీకే స్కూల్‌, కడప

భాషపై పట్టు సాధించేందుకు దోహదం..

ఆంగ్ల భాష పట్ల ఉన్న ఆసక్తే నన్ను ఈ కాంపిటీషన్‌కు వచ్చేలా చేసింది. గతంలోనూ పలుమార్లు స్పెల్‌ ‘బీ’లో పాల్గొన్నాను. ఆంగ్లంపై పూర్తి పట్టు సాధించాలన్న నా లక్ష్యానికి ఈ పోటీలు ఎంతో దోహదపడుతున్నాయి. ఇందుకోసం బాగా ప్రిపేర్‌ అయ్యాను.

– శ్రీలేఖ, జీఎంఆర్‌ స్కూల్‌, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement