భక్తిశ్రద్ధలతో హిందూ ధార్మిక వనభోజనం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో హిందూ ధార్మిక వనభోజనం

Nov 30 2026 1:52 AM | Updated on Nov 30 2026 1:52 AM

శ్రీ లలితా పంచాయతన ఆలయంలో కలశాలతో ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు

వనభోజన ప్రాంగణంలో కల్యాణమూర్తులుగా

శివ పార్వతులు

కడప సిటీ : కడప నగర శివార్లలోని లలితా పంచాయతన ఆలయ పరిసరాల్లో ఆదివారం హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 17 వేల మంది ధార్మిక సంస్థల ప్రతినిధులు, భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. చిన్మయ మిషన్‌ అధ్యక్షుడు స్వామి తురియానంద సరస్వతి నేతృత్వంలో ఉదయం నుంచే విశేష పూజలు ప్రారంభమయ్యాయి. శ్రీకంఠేశ్వరునికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం దాతలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు 108 కలశాలతో ఆలయ ప్రదక్షిణ చేసి జలాభిషేకం, పంచామృతాభిషేకం జరిపించారు. తర్వాత వేదమంత్రోచ్ఛారణల నడుమ శివపార్వతుల కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది.ఈ వేడుకకు విజయవాడకు చెందిన శ్రీ కమలానంద భారతి స్వామీజీ, బ్రహ్మంగారిమఠం తోట్లపల్లెకు చెందిన శ్రీ విరజానంద స్వామీజీ హాజరై భక్తులకు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. అనంతరం మధ్యాహ్నం భక్తులందరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా సహపంక్తి వనభోజనాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

పూజల్లో మాజీ డిప్యూటీ మేయర్‌ దంపతులు

ఈ వనభోజన మహోత్సవంలో కడప నగర మాజీ డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డి, ఆయన సతీమణి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బండి దీప్తిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement