మ్యాథ్స్‌ అంటే ఎంతో ఇష్టం.. | - | Sakshi
Sakshi News home page

మ్యాథ్స్‌ అంటే ఎంతో ఇష్టం..

Nov 30 2026 1:52 AM | Updated on Nov 30 2026 1:52 AM

నాకు గణితం అంటే ఎంతో ఇష్టం. సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యాథ్‌ ‘బి’ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు వచ్చాను. ఈ కాంపిటీషన్‌ ఎంతో బాగుంది. వచ్చే ఏడాది కూడా పాల్గొంటా.

– వి. విద్యాసాయి, నేతాజీస్కూల్‌, గురజాల,

సింహాద్రిపురం

గణిత భావనలపై పట్టు సాధించేందుకు..

గణితంలో రాణిస్తే అన్నింటా రాణించే అవకాశం ఉంది. అందుకే గణితంపై పట్టుసాధించేందుకు బేసిక్స్‌ నుంచి పట్టుసాధిస్తున్నా. ఇందులో భాగంగా మ్యాథ్‌‘బి’లో సత్తా తెలుసుకునేందుకు వచ్చాను. కాంపిటీషన్‌ చాలా బాగుంది.

– రవి కింగ్‌స్టన్‌, శ్రీ చైతన్య వేంపల్లి

మ్యాథ్స్‌ మేడ్‌ ఈజీ..

గణితం అంటే ఎంతో ఇష్టం. గణితాన్ని సులువుగా నేర్చుకునేందుకు ఎప్పుడూ సిద్ధమవుతుంటా. మ్యాథ్స్‌ కాంపిటీషన్స్‌ ఎక్కడ జరిగినా పాల్గొంటా. గణితంపై ఉన్న ఆసక్తే నన్ను ఇందులో పాల్గొనేలా చేసింది.

– కార్తీకేయ, శివ శివానీ స్కూల్‌ కడప

గణితం అంటే భయం పోయింది..

గణితం అంటే ఎక్కడో ఏదో ఒక మూల కొద్దిపాటి భయం ఉండేది. అయితే ఈ కాంపిటీషన్‌లో పాల్గొన్న తర్వాత నేను కూడా చక్కగా గణిత సమస్యలను పరిష్కరించగలనన్న నమ్మకం కలిగింది. సాక్షి మ్యాథ్‌ ‘బి’ కాంపిటీషన్‌ నిర్వహణ బాగుంది.

– దీపక్‌, కడప పబ్లిక్‌ స్కూల్‌, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement