వైఎస్సార్‌సీపీలో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

Jun 23 2026 1:52 AM | Updated on Jun 23 2026 1:52 AM

కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని వివిధ హోదాలలో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ఎస్సీవిభాగం కార్యదర్శిగా గోటూరు వెంకటేష్‌ (ప్రొద్దుటూరు), రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా పంగా గురివిరెడ్డి(బద్వేల్‌),

జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా భూమిరెడ్డి ప్రతాప్‌రెడ్డి(జమ్మలమడుగు)లను నియమించారు.

24 నుంచి

పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

కడప ఎడ్యుకేషన్‌: ఏపీ పాలిసెట్‌–2026లో అర్హత సాధించిన విద్యార్థులు డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం మొదటి దశ వెబ్‌ కౌన్సెలింగ్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిందని పాలిసెట్‌ కో ఆర్డినేటర్‌ సీహెచ్‌ జ్యోతి తెలిపారు. వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ 24 నుంచి జులై 4వ తేదీ వరకు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ ధ్రువీకరణ, ఫీజు చెల్లింపు, వెబ్‌ అప్లన్ల నమోదు ఉంటుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ polycet.ap.gov.inలో అందుబాటులో ఉన్న పూర్తి వివరాలను పరిశీలించి నిర్ణీత గడువులోపు తమ సర్టిఫికెట్‌ ధృవీకరణ, ఫీజు చెల్లింపు ,వెబ్‌ ఆప్లన్స నమోదును పూర్తి చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులో ఏవైనా వివరాల మార్పులు లేదా సవరణలు అవసరమైన విద్యార్థులు కడపలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.

27 వరకు రైతన్న మీ కోసం

కడప అగ్రికల్చర్‌: ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని జిల్లాలో 2026 జూన్‌ 22 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ తరపున విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం జేసీ నిధిమీనా, డీఆర్‌ఓ మల్లికార్జునుడు, జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావుతోపాటు కలిసి ఆయన ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలలో నిర్వహించబడే ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ సీఈఓ సుబ్రమణ్యం, డీపీఓ వెంకటసుబ్బయ్య, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement