ముద్దనూరు : మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కాండ్లోపల్లె గ్రామానికి చెందిన రవీంద్రనాథరెడ్డి(36) తరచూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఈ నెల 19వ తేదీన ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆయన కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అలాగే మండలంలోని గంగాదేవిపల్లె గ్రామంలో సూర్యనారాయణరెడ్డి కొంత కాలంగా పక్షపాతంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. వ్యాధి తీవ్రతతో మనస్తాపం చెంది ఈ నెల 20న పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


