యువత ఉపాధి, సామాజిక భద్రతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

యువత ఉపాధి, సామాజిక భద్రతే లక్ష్యం

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

– కలెక్టర్‌ డాక్టర్‌చెరుకూరి శ్రీధర్‌

కడప సెవెన్‌రోడ్స్‌ : యువతకు ఉపాధి, సామాజిక భద్రత కల్పనే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమంలో కలెక్టరేట్‌ సభా భవనంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. పీఎం వీబీఆర్‌వై పథకం ద్వారా ఉద్యోగ అవకాశాలతోపాటు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి మరింత మంది కార్మికులు వస్తారన్నారు. జిల్లాలో కూడా పరిశ్రమల అభివృద్ది, నైపుణాభివృద్ది, ఉపాధి కల్పనా చర్యలకు జిల్లా యంత్రాంగం సహకరిస్తోందన్నారు. త్వరలో ప్రారంభం కానున్న స్టార్టప్‌ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌ సెంటర్‌ జిల్లాలో వ్యవస్థాపక సంస్కృతికి కొత్త ఊపు తీసుకొస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు.

నేడు కడపలో జాబ్‌మేళా

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాధికల్పనాధికారి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి అందెల సురేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.ఐసీఐసీఐ బ్యాంకులో సేల్స్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అలాగే టయోవిజన్‌ కాంపోజిటివ్‌ టెక్నాలజీ సంస్థలో ప్రొడక్షన్‌, క్వాలిటీ ఇంజినీర్లు, క్యూఎంఎస్‌ ఇంజినీర్‌ తదితర ఉద్యోగాలకు డిప్లొమా, బీటెక్‌, ఎంటెక్‌ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అల్‌డిక్సన్‌ కంపెనీలో వివిధ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ నుంచి పీజీ వరకు, ఐటీఐ డిప్లొమా అర్హత గల అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement