కడప అర్బన్: కడప నాగరాజుపేటలో ఓ పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికపై, అదే స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న వడిషా వెంకటేశ్వర్లు (42) కన్ను వేశాడు. 2023 ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 4:30 గంటల సమయంలో బాలిక తల్లి ఇంట్లో లేని సమయాన్ని చూసి, నిందితుడు నివాస ప్రాంగణంలోని వర్కర్ల గది వద్దకు బాలికను మాట్లాడాలని పిలిచాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి బాలికను బలవంతంగా కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్నాడు. ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్‌న్‌లో రికార్డు చేసి, ఆ వీడియో చూపిస్తూ బాలికను అప్పుడప్పుడు బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి తెలపడంతో, ఆమె కడప వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి కడప వన్‌టౌన్ సీఐ ఎన్.వి. నాగరాజు నమోదు చేశారు. నిందిడుడిని అరెస్ట్‌చేశారు. దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కడప పొక్సో కోర్టు న్యాయమూర్తి ఎం.ఏ సోమశేఖర్ ఈ కేసును విచారించారు. సాక్ష్యాధారాలను పరిశీలించి,నేరం రుజువు కావడంతో అతనికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 3,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన పొక్సోకోర్టుఅడిషనల్ పబ్లిక్‌ప్రాసిక్యూటర్ కె. వేణుగోపాల్, నిందితునికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన కోర్టు మానిటరింగ్ సెల్ ఏఎస్‌ఐ నాగేంద్ర, కానిస్టేబుల్ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రస్తుత సీఐ వి. చిన్న పెద్దయ్యను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రశంసించారు.
నిందితుడికి మూడేళ్ల జైలు


