22న పారా బ్యాడ్మింటన్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

22న పారా బ్యాడ్మింటన్‌ ఎంపికలు

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

22న పారా  బ్యాడ్మింటన్‌ ఎంపికలు

22న పారా బ్యాడ్మింటన్‌ ఎంపికలు

22న పారా బ్యాడ్మింటన్‌ ఎంపికలు నూతన నియామకం జిల్లా అధికార ప్రతినిధిగా.. ఏప్రిల్‌ 25న పాలిసెట్‌ 23న తరిగొండ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఆటోమేషన్‌ ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట

కడప వైఎస్సార్‌ సర్కిల్‌:ఈ నెల 22న రాష్ట్రస్థాయి పారా బ్యాడ్మింటన్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు దామోదర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 9000672017, 99631 94010 నంబర్లకు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియో జ కవర్గానికి చెందిన గుండా సురేంద్రను వైఎస్‌ఆర్‌సీపీ మైదాన ప్రాంత ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ కార్యాలయం ప్రకటించింది. తనకు ఈ బాధ్య తను అప్పగించినందుకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, సహకరించిన రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డికి, అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్‌ అలూరి సాంబశివారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

సాక్షి అన్నమయ్య: వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధిగా రాయచోటికి చెందిన గాజుల హాజిబాష, జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా రాజంపేటకు చెందిన కల్లూరు రమేష్‌గౌడ్‌, జిల్లా ప్రచార విభాగం ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా రాయచోటికి చెందిన వి.సురేష్‌కుమార్‌రెడ్డిలను నియమించారు.

కడప ఎడ్యుకేషన్‌: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 25వ తేదీ నిర్వహించబడుతుందని జిల్లా పాలిసెట్‌ కో–ఆర్డినేటర్‌ సీహెచ్‌ జ్యోతి తెలిపారు. ఈ పాలిసెట్‌–2026 ప్రవేశ పరీక్ష కోసం వైఎస్సార్‌ కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలతో పాటు ఈ ఏడాది అదనంగా బద్వేల్‌, జమ్మలమడుగు, పులివెందుల, సింహాద్రిపురంలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పాలిసెట్‌–2026 పరీక్షకు ఉచిత శిక్షణ తరగతులు ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. వీటికి హాజరయ్యే విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్‌ (తెలుగు ఇంగ్లీష్‌) అందజేస్తామన్నారు.

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల సమీపంలోని తరిగొండ శ్రీలకీ్‌ష్మ్‌నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 24 నుంచి మార్చి 5వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈనెల 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈమేరకు టీటీడీ గురు వారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అలాగే బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లుచేపట్టింది. అందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు, రంగోలీలు, క్యూలైన్లు, బారికేడ్లు, ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్‌, పుష్పాలంకరణలను చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు ఉంటాయి.

కడప అగ్రికల్చర్‌ : బిందు, తుంపర సేద్యానికి అటోమేషన్‌ ఏర్పాటు చేయడం ద్వారా వృథా నీటికి అడ్డుకట్ట వేయొచ్చని ఏపీ సూక్ష్మ నీటి సాగు పథకం ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటేశ్వరెడ్డి అన్నారు. కడప కలెక్టరేట్‌లోని ఆంధ్రప్రదేశ్‌ సూక్ష్మ నీటి సాగు పథకం కార్యాలయంలో గురువారం క్షేత్రస్థాయి అధికారులు, కంపెనీ ప్రతినిధులకు ఆటోమేషన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యాన, వ్యవసాయ సంబంధిత పంటలు పండించే రైతులకు వ్యవసాయం సులభతరం చేయడానికి, నీటి వినియోగం పెంచి పంటల దిగుబడి మెరుగుపరచడానికి డ్రిప్పుతో అనుసంధానించిన ఆటోమేషన్‌ సేవలను పోత్సహిస్తోందని తెలిపారు.

ఆటోమిషన్‌ సబ్సిడీ వివరాలు..

రెండు హెక్టార్లలోపు భూమి కలిగి ఉన్న రైతులకు 55 శాతం సబ్సిడీతో రూ. 22,000 మించకుండా.. 2 నుంచి 4 హెక్టార్లులోపు భూమి కలిగిన అన్ని వర్గాల రైతులకు 45 శాతం సబ్సిడితో 18,000 వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ మురళీమోహన్‌రెడ్డి, ఎంఐ ఇంజనీర్లు, ఎంఐడిలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement