ఆస్తులకు ఆటో మ్యుటేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆస్తులకు ఆటో మ్యుటేషన్‌

Aug 1 2025 11:50 AM | Updated on Aug 1 2025 11:50 AM

ఆస్తు

ఆస్తులకు ఆటో మ్యుటేషన్‌

కడపకోటిరెడ్డిసర్కిల్‌ : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదాయ మార్గాలకు కొత్తదారిని ఎంచుకుంటోంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి వాటి అమలుకు నిధుల వేట కొనసాగిస్తోంది. రిజిస్ట్రేషన్‌ శాఖలో ఆగస్టు 1వ తేదీ నుంచి ఆస్తులకు ఆటోమ్యుటేషన్‌ పేరిట కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నారు. ఎవరైనా ఇంటి, నీటి పన్ను బకాయిలు ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగవు. గతంలో అయితే ఈ పన్నుల బకాయిలు ఉన్నా రిజిస్ట్రేషన్లు చేసేవారు. ఆ తర్వాత వినియోగదారుడు మున్సిపల్‌ కార్యాలయంలో మ్యూటేషన్‌ చేసుకునేవారు. అయితే ఈ ప్రక్రియలో పన్ను బకాయిలు ఉన్నా రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధం లేదు. రిజిస్ట్రేషన్లు చేసేవారు. అయితే ఇప్పుడు మ్యూటేషన్‌ ప్రక్రియను పూర్తి చేసేవారు సచివాలయాల నుంచిగానీ, నగర పాలక సంస్థ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంటే పరిశీలన అయ్యాక టైటిల్‌ మార్పు చేసి పన్ను విధించేవారు. ఈ విధానంలో మార్పును తీసుకు వస్తూ ఆటో మ్యూటేషన్‌ పేరిట కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.

ముఖ్యంగా వ్యవసాయ పొలాలకు మాత్రమే ఆటో మ్యూటేషన్‌ విధానం అమలులో ఉండేది. వాటిని నగరాల్లోని ఇల్లు, వాణిజ్య సముదాయాలకు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని మొదట ఎన్టీఆర్‌ జిల్లాలోని విజయవాడలో అమలు చేశారు. అక్కడ ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కడపతోపాటు 17 కార్పొరేషన్ల పరిధిలో దీనిని శుక్రవారం నుంచి అమలు చేయనున్నారు. నగరంలో ఏదైనా స్థలం లేదా ఇంటిని తీసుకుంటే కొనుగోలుదారులు ఆస్తిని తమ పేరిట మార్చుకునేందుకు నగర పాలక సంస్థ కార్యాలయంలో వీటి కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా ఆస్తి ఉన్న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా ఆటో మ్యూటేషన్‌ చేయనున్నారు.

బకాయిలు ఉంటే శ్లాబ్‌ బుక్‌ కాదు

గతంలో ఇల్లు, స్థలాలు, వాణిజ్య సముదాయాల రిజిస్ట్రేషన్‌కు, మ్యూటేషన్‌కు సంబంధం ఉండేది కాదు. పన్ను బకాయిల విషయం వారికి ఉండదు. రిజిస్ట్రేషన్‌ అయ్యాక కొనుగోలుదారులు ఆ పత్రాల వివరాలతో నగర పాలక సంస్థ కార్యాలయంలో ఓనర్‌షిప్‌ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకునేవారు. అయితే ఇప్పుడు అలా కాకుండా రిజిస్ట్రేషన్‌ శ్లాబ్‌ బుకింగ్‌ సమయంలోనే పన్నులు పెండింగ్‌ లేకుండా అప్‌డేట్‌ అయి ఉండాలి. సంబంధిత వివరాలను అప్‌లోడ్‌ చేశాకే శ్లాట్‌ బుక్‌ అవుతుంది. గతంలో రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇంటికి చెల్లిస్తున్న రశీదు ఖాళీ స్థలమైతే పన్ను రశీదు అందజేసేవారు. ఒకవేళ ఒకే ఆస్తిని ఇద్దరు లేక ముగ్గురు కలిసి కొనుగోలు చేసినా ఇదే విధానం వర్తిస్తుంది. మున్సిపాలిటీ వారు ఇచ్చిన అసెస్‌మెంట్‌ నెంబర్లను తప్పక నమోదు చేయాలి. మార్కెట్‌ విలువ, విస్తీర్ణం ఆధారంగా మ్యూటేషన్‌ ఛార్జీలను చెల్లించాలి. ప్రస్తుతం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కాగానే ఆ వివరాలను కార్పొరేషన్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేస్తారు. అక్కడ వారు పరిశీలించి ఓకే చెప్పగానే ఆటో మ్యూటేషన్‌ సర్టిఫికెట్‌ జనరేట్‌ అవుతుంది. ప్రక్రియ ముగిశాక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద కొత్త డాక్యుమెంట్లతోపాటు ఆస్తి బదలాయింపు పత్రం కూడా పొందేలా ప్రక్రియను చేపడతారు. మార్కెట్‌ విలువ, విసీ్త్రర్ణం ఆధారంగానే మ్యూటేషన్‌ ఛార్జీలు చెల్లించాలి.

నేటి నుంచి విధానం అమలు

పన్ను బకాయిలు ఉంటే

శ్లాట్‌ బుక్‌ అవదు

మార్కెట్‌ విలువ, విీస్తీర్ణం

ఆధారంగా మ్యూటేషన్‌ చార్జీలు

నగర వాసులకు ఎంతో ప్రయోజనం

వినియోగదారులకు ఎంతో ఉపయోగకరం

ఆటో మ్యుటేషన్‌ విధానాన్ని శుక్రవారం నుంచి ప్రవేశ పెడుతున్నాం. రిజిస్ట్రేషన్‌ శ్లాట్‌ బుకింగ్‌ సమయంలోనే నగర పరిధిలోని ఆస్తుల అసెస్‌మెంట్‌ నెంబరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. అప్పుడు ఎలాంటి బకాయిలు ఉండరాదు. ఈ విధానంతో వేగంగా మ్యూటేషన్‌ జరుగుతుంది. ఇది వినియోగదారులకు ఎంతో ఉపయోగకరం. – పీవీఎన్‌ బాబు, జిల్లా రిజిస్ట్రార్‌, కడప

ఆస్తులకు ఆటో మ్యుటేషన్‌ 1
1/1

ఆస్తులకు ఆటో మ్యుటేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement