
చీనీ కాయలు తరలించారు.. డబ్బులు ఎగ్గొట్టారు !
చీనీ కాయల డబ్బులను
వెంటనే చెల్లించాలి
ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంకుస్థాపనకు వస్తున్నారని కూటమి నాయకులు, సంబంధిత అధికారులు పులివెందుల ప్రాంతంలోని పలు మండలాల నుంచి సుమారు 150 టన్నుల చీనీ కాయలను తరలించారు. మూడు నెలలవుతున్నా ఒక్క పైసా కూడా ఇవ్వ లేదు. దీంతో రైతులు, మండి యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చీనీ కాయలకు సంబంధించిన డబ్బులను వెంటనే ఇవ్వాలి.
– సూరారెడ్డి, చీనీ కాయల మండీ
అసోసియేషన్ అధ్యక్షుడు, పులివెందుల.
ఇస్తామంటున్నారు.. ఇవ్వడంలేదు..
పులివెందుల చీనీ కాయల మార్కెట్ నుంచి అమరావతి శంకుస్థాపనకు రూ.25 లక్షలు విలువ చేసే సుమారు 150 టన్నుల చీనీ కాయలను మూడు నెలల క్రితం 11 లారీలలో తరలించాము. దీనికి సంబంధించిన డబ్బులను అడిగితే సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఇస్తాంలే.. పైనుంచి డబ్బులు రాలేదంటున్నారు.
– రమణారెడ్డి, చీనీకాయల
మండీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్.
పులివెందుల రూరల్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో నూతన రాజధాని నిర్మాణ పనులకు ఈ ఏడాది జూన్ 2వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు పులివెందుల నియోజకవర్గంలోని చీనీ కాయల రైతుల వద్ద నుంచి సుమారు రూ.25 లక్షలు విలువచేసే 150 టన్నుల చీనీ కాయలను విజయవాడకు 11 లారీలలో తరలించారు. మూడు నెలలవుతున్నప్పటికీ అధికారులు చీనీ కాయల మండి యజమానులు, రైతులకు డబ్బులు చెల్లించలేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన చీనీ కాయల డబ్బులను అధికారులు మండి యజమానులకు చెల్లిస్తే వారు రైతులకు చెల్లించాల్సి ఉంది. మూడు నెలల నుంచి చీనీ కాయల డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నా అటు ప్రభుత్వ అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులను చీనీ కాయల డబ్బులు చెల్లించాలని అడిగితే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారని వారు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి విజయవాడకు తరలించిన చీనీ కాయలకు సంబంధించిన డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మండి యజమానులు, రైతులు కోరుతున్నారు.
అమరావతి శంకుస్థాపనకు
పులివెందుల నుంచి తరలిన
150 టన్నుల చీనీ కాయలు
డబ్బులు చెల్లించని అధికారులు
మూడు నెలలుగా ఎదురు చూస్తున్న రైతులు, మండీ యజమానులు

చీనీ కాయలు తరలించారు.. డబ్బులు ఎగ్గొట్టారు !

చీనీ కాయలు తరలించారు.. డబ్బులు ఎగ్గొట్టారు !