
డ్రాగా ముగిసిన అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. మూడో రోజు గురువారం వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప–అనంతపురం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 242 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 84.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 325 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని ఆదినారాయణరెడ్డి బ్యాటింగ్‌లో చక్కగా రాణించి 156 పరుగులు చేశాడు. దేవాన్ష్ 47 పరుగులు చేశాడు. కడప జట్టులోని హితేష్ సాయి 3 వికెట్లు, గైబు 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 67.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోకేష్ 85 పరుగులు, ఫైజాన్ 45 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని కిరణ్‌కుమార్ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ అనంతపురం జట్టు ఆధిక్యం సాధించింది.
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో చిత్తూరు–కర్నూలు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. గురువారం మూడో రోజు 300 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 111.5 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని వివేక్ 35 పరుగులు చేశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 71.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని విజె నోయెల్ 60 పరుగులు, హర్ష 36 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని వివేక్ 3 వికెట్లు, సాయి విఘ్నేష్ 3 వికెట్లు తీశారు. తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 12 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. దీంతో చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది.

డ్రాగా ముగిసిన అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లు

డ్రాగా ముగిసిన అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లు

డ్రాగా ముగిసిన అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లు

డ్రాగా ముగిసిన అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లు