
అక్రమ చేపల వేట నిర్వహణపై కఠిన చర్యలు
కడప అగ్రికల్చర్ : నిషేధిత సమయంలో జలాశయాలలో అక్రమ చేపల వేట నిర్వహించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మ్యత్స్యశాఖ సిబ్బందిని రాష్ట్ర మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం కడపలోని మత్స్యశాఖ కార్యాలయంలో కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన మ త్స్యశాఖ అధికారులు, సిబ్బందితో శాఖాపరమైన స మీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత లైసెన్సులు జారీ చేసే జలాశయాలైన సోమశిల వెనుక జలాలు, బ్రహ్మసా గర్, గండికోట జలాశయాలలో చేపల వేట నిషేధాన్నిటాస్క్‌ఫోర్స్ కమిటీతో పకడ్బందీగా అమలు చేయా లని సూచించారు. మత్స్యశాఖ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ కమిటీలు ఏర్పాటు చేసి అక్రమ చేపల వేటను అరికట్టాలన్నారు. అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద సంయోజన పథకంలో వివిధ యూనిట్ల అమలు గురించి ఆరా తీశారు. దీంతోపాటు ఎన్‌ఎఫ్‌డీపీ, ఈ శ్రమ మత్స్యకారులకు సంబంధించి వివరాలు రిజిస్ట్రేషన్ చేసే విషయం, అలాగే కేసీసీ లోన్స్ మంజూరుపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రాష్ట్ర మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి కార్యాలయ ఆవరణంలో చేప పిల్లల పెంపకానికి సంబంధించిన నీటిలో చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నాగయ్య, అన్నమయ్య జిల్లా ఎఫ్‌డీఓలు మోహన్‌క్రిష్ణ, సుబ్బనరసయ్య, నరేంద్రబాబు, మురళీ, కడప జిల్లా ఎఫ్‌డీఏలు కిరణ్‌కుమార్, బాలరాజు రెండు జిల్లాల గ్రామ మత్స్య సహాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్
చంద్రశేఖర్‌రెడ్డి