● స్టీల్‌ ప్లాంట్‌ కోసం.. | - | Sakshi
Sakshi News home page

● స్టీల్‌ ప్లాంట్‌ కోసం..

Aug 2 2025 6:36 AM | Updated on Aug 2 2025 6:36 AM

● స్ట

● స్టీల్‌ ప్లాంట్‌ కోసం..

జమ్మలమడుగు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ పాతపాటే పాడారు.. ఎప్పట్లాగే అబద్ధాలే వల్లె వేశారు. ‘రాయలసీమను హార్టికల్చర్‌ హాబ్‌గా మారుస్తా... జిల్లాను పర్యాటక హబ్‌గా చేస్తా..’ అంటూ అవే డాంబికాలు పోయారు. 2014లో మొదలుపెట్టిన రాగాన్నే మళ్లీ సవరించారు. ఇప్పటివరకు రెండుసార్లు సీఎం హోదాలో పని చేసినా ఇంతవరకు రూపాయి విదిల్చింది లేదు. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందిన దాఖలా అస్సలు లేదు. ప్రపంచ పర్యాటకకేంద్రంగా ఉన్న గండికోటలో హరిత హోటల్‌ నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయంలోనే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన మౌళిక సదుపాయాలు సైతం కల్పించలేకపోయారు.

గండికోట ప్రాజెక్టుకు రెండు సార్లు

శిలాఫలకం వేసి ఏం చేశారు..

గండికోటప్రాజెక్టు నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు సార్లు శిలాఫలకం వేశారు. ఏనాడు ప్రాజెక్టు నిర్మాణం కోసం మొగ్గుచూపలేదు. 2004లో మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గండికోట ప్రాజెక్టు నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు. 22 గ్రామాల ప్రజలకు పరిహారం ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 90 శాతం పనులు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. కేవలం పదిశాతం పనులు మాత్రమే చంద్రబాబు పూర్తి చేసి తామే ప్రాజెక్టు పూర్తి చేశామని చెబుతుండటంతో జిల్లావాసులు,నియోజకవర్గంలోని ప్రజలు నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం రాయలసీమకు సాగు, తాగునీరు అందించేందుకు హంద్రీనీవా– గాలేరు–నగరి ప్రాజెక్టులు శ్రీకారం చుట్టామని చంద్రబాబు చెబుతున్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచి ఏకంగా గాలేరు–నగరి కాలువల్లో 20 వేల క్యూసెక్కులు వరద నీరు ప్రవహించేవిధంగా కాలువలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అవుకు, లింగాపురం వద్ద కొండలకు టన్నెల్‌ వేసి నీటిని గండికోట ప్రాజెక్టుకు తరలించేవిధంగా చర్యలుచేపట్టిన ఘనత వైఎస్‌దే అని జిల్లా వాసులకు తెలియందికాదు. అలాంటి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని సమావేశంలో చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని నియోజకవర్గవాసులు ఎద్దేవా చేస్తున్నారు. ఇక మైలవరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కనీసం టీడీపీనే ఆవిర్భవించలేదని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాసుబ్రహ్మానందరెడ్డి 1974లో 100కోట్ల రూపాయలతో మైలవరం జలాశయం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దానిని 1983 నాటికిపూర్తి చేస్తే అప్పటి ముఖ్యమంత్రిగా ఎన్‌టీరామారావు ప్రారంభోత్సవం చేశారే తప్ప టీడీపీ చేసిందేమీ లేదు. కాలువల్లో నీరు ప్రవహించపోవడం, చివరి ఆయకట్టురైతుకు మైలవరం జలాశయం నుంచి నీరు అందకపోవడంతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైలవరం ఉత్తర,దక్షిణ కాలువలకు 150 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఉత్తర కాలువ రత్న కంపెనీ, దక్షిణ కాలువ పనులను సీఎం రమేష్‌ నాయుడు కు చెందిన రిత్విక్‌ కంపెనీ చేసింది. ఈ విషయం కూడా చంద్రబాబు తెలియకుండా మైలవరం ప్రాజెక్టు సైతం తామే పూర్తిచేశామని చెప్పుకోవడం పట్ల ప్రజలందరూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో టీడీపీ ప్రభుత్వం గాని చంద్రబాబునాయుడు గాని నిర్మించిన దాఖలాలులేవు. వచ్చిన ప్రతిసారి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పా జిల్లాకు చేసిందేమీలేదని జిల్లా ప్రజలు వాపోతున్నారు. కాగా చంద్రబాబు ప్రసంగిస్తున్నంత సేపు జనాలు విసుగెత్తిపోయి చూస్తూ ఉండిపోతున్నారే తప్ప ఎటువంటి మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం. ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు చెప్పిన మాటలన్ని సుద్ద అబద్ధాలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిస్సిగ్గుగా అసత్యాలు వల్లెవేసిన సీఎం చంద్రబాబు

గండికోటకు రెండు సార్లు శిలాఫలకం వేసి పైసాకూడ నిధులు కేటాయించలేదు

వైఎస్సార్‌ హాయంలోనే రాయలసీమలోసాగునీటి ప్రాజెక్టులకు మోక్షం

2019 జనవరి 24న మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన చంద్రబాబు ప్లాంట్‌ నిర్మాణం కోసం ఒక సెంటు భూమి కూడా కేటా యించలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సున్నపురాళ్లపల్లె వద్ద 3000 ఎకరాలు వైఎస్సార్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం భూమిని కేటాయించడంతోపాటు 70 కోట్ల రూపాయలతో పనులను కూడా చేపట్టారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన బాధితులకు పట్టాగలిగిన రైతులకు పరిహారం అందించారు. జిందాల్‌ కంపెనీ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ముందుకు తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ ప్రాంతంలోనే స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం చర్యలు చేపట్టింది.

● స్టీల్‌ ప్లాంట్‌ కోసం.. 1
1/3

● స్టీల్‌ ప్లాంట్‌ కోసం..

● స్టీల్‌ ప్లాంట్‌ కోసం.. 2
2/3

● స్టీల్‌ ప్లాంట్‌ కోసం..

● స్టీల్‌ ప్లాంట్‌ కోసం.. 3
3/3

● స్టీల్‌ ప్లాంట్‌ కోసం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement