మట్కా బీటర్లు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మట్కా బీటర్లు అరెస్ట్‌

Jun 18 2025 3:47 AM | Updated on Jun 18 2025 3:47 AM

మట్కా బీటర్లు అరెస్ట్‌

మట్కా బీటర్లు అరెస్ట్‌

జమ్మలమడుగు రూరల్‌ : జమ్మలమడుగు పట్టణంలోని అలంకార్‌ సినిమా హాలు వద్ద 5 మంది మట్కా బీటర్లను అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి మట్కా పట్టీలు, రూ. 1,39,000 స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ హైమావతి మంగళవారం తెలిపారు. పట్టణంలోని అలంకార్‌ సినిమా హాల్‌ వద్ద మట్కా బీటర్లు ఉన్నట్లు ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో కలసి దాడి చేశామన్నారు. ఈ దాడిలో షేక్‌ గౌస్‌ ఖలందర్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆంధ్రసౌత్‌ జోన్‌ క్రికెట్‌ జట్టుకు నందలూరు బాలిక

నందలూరు : ఆంధ్ర సౌత్‌ జోన్‌ క్రికెట్‌ జట్టుకు నందలూరు విభా ఏరుడైట్‌ స్కూల్‌కు చెందిన హనుమంతు పూర్విజా ఎంపికై నట్లు క్రికెట్‌ సబ్‌ సెంటర్‌ కోచ్‌లు గయాజ్‌, ఫైరోజ్‌ఖాన్‌ లోడీలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ పూర్విజ స్థానిక సబ్‌సెంటర్లో ఫాస్ట్‌ బౌలింగ్‌లో శిక్షణ పొందుతూ మంచి క్రమశిక్షణతో శ్రమించి ప్రాక్టీస్‌ చేస్తూ జిల్లా జట్టుకు ఎంపిక అయిందన్నారు. తన ఫాస్ట్‌ బౌలింగ్‌తో నెల్లూరు జిల్లాలో జరిగిన జిల్లా క్రికెట్‌ మ్యాచ్‌లలో నెల్లూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో అన్ని జిల్లాల మీద మంచి వికెట్లు సాధించి అండర్‌ –15 విభాగంలో ఆంధ్రా సౌత్‌జోన్‌ జట్టుకు ఎంపిక అయిందన్నారు.

వివాహిత ఆత్మహత్య

మదనపల్లె రూరల్‌ : వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం రామసముద్రం మండలంలో జరిగింది. కాప్పల్లె చెందిన సంతోష్‌ కు ఏడేళ్ల క్రితం కర్ణాటకకు చెందిన అహల్య (27) తో వివాహం జరిగింది. వీరికి రోహన్‌ సాయి, రుషి ఇద్దరు కుమారులు ఉన్నారు. సంతోష్‌ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత కొంతకాలంగా అహల్య వేరు కాపురం పెట్టాలని భర్తతో తరచూ గొడవపడుతుండేది. మంగళవారం ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అహల్య పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement