
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
కడప సెవెన్‌రోడ్స్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రొటోకాల్ నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడులతో కలిసి జిల్లాలో ముఖ్యమంత్రి పాల్గొనే సీకే దిన్నె మండల పరిధిలోని పబ్బాపురం సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభా స్థలం వద్ద అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా విధులు కేటాయించిన అధికారులందరూ.. ప్రొటోకాల్ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభా ప్రాంగణం, పరిసరాలలో పారిశుద్ధ్య పనులు పక్కాగా ఉండా లని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, డీపీఓ రాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ నాగరాజు, పోలీసు, ఫైర్ ఆఫీసర్ ధర్మారావ్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పీఆర్ ఎస్‌ఈ శ్రీనివాస రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
బహిరంగ సభ స్థలం వద్ద అధికారులతో సమావేశం