
● రాయితీ అందించినా గుదిబండే...!
రాయితీ ద్వారా ప్రాజెక్టు పెట్టుకోవచ్చంటూ అధికారులు ప్రచారం చేస్తున్నా వినియోగదారునికి మొదట భారం తప్పేలా కనిపించడం లేదు. ఉదాహరణకు 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాలంటే రూ.78వేల వరకు గరిష్టంగా సబ్సిడీ అందిస్తామని చెబుతున్నారు. అయితే ఈ రాయితీ మనం వినియోగించుకునే పలకలకు అనుగుణంగా ఉంటుంది. అంటే రూ.78వేల కంటే తక్కువ సబ్సిడీ వస్తుంది కానీ వినియోగదారుడు మాత్రం రూ.1.80లక్షల వరకూ భరించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తుకు, నెట్ మీటర్‌కు కూడా చార్జీలు వసూలు చేసేవారు. ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ చార్జీల నుంచి ఉపశమనం కల్పించారు.