నవభారత నిర్మాత అంబేడ్కర్
కడప సెవెన్‌రోడ్స్ : నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్‌కుమార్, పలువురు నేతలు అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్‌కు ఘన నివాళి అర్పించారు.
● కలెక్టరేట్ ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్‌తోపాటు జేసీ అదితి సింగ్, ఇన్‌చార్జి డీఆర్వో శ్రీనివాసులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్పందన హాలులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లేశ్, జేసీ అదితిసింగ్, ఇన్‌చార్జి డీఆర్వో శ్రీనివాసులు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ సేవలను కొనియాడారు. జిల్లాలో పునరుద్ధరణ లో ఉన్న అంబేడ్కర్ భవన్ త్వరలో నిర్వహణలోకి తీసుకు రానున్నామన్నారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ , జేసీ అదితిసింగ్ , సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతీ, మైనారిటీ, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ డాక్టర్ వి.బ్రహ్మయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రెసిడెంట్ ఎస్. మల్లికార్జున, రాయలసీమ యాదవ కమ్యునిటీ వెల్ఫర్ వ్యవస్థాపక అధ్యక్షుడు జి. నారాయణ యాదవ్, రాయలసీమ దళిత, గిరిజన మానవ హక్కుల వేదిక అధ్యక్షులు జేవీ రమణ, చేతివృత్తుల ఐక్య వేదక పార్టీ జాతీయ అధ్యక్షులు అవ్యారు మల్లికార్జున, ఆర్‌పీఐ. లీగల్ సెల్ చైర్మన్, అడ్వకేట్ వై.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
● ఎస్పీ కార్యాలయంలో..
కడప అర్బన్: భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎస్.పి అశోక్ కుమార్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ అంబేడ్కర్ సేవలను కొనియాడారు.
నివాళులర్పించిన అధికారులు, నేతలు, స్వచ్ఛంద సంస్థలు
కలెక్టరేట్‌లో ఘనంగా జయంతి వేడుకలు
నవభారత నిర్మాత అంబేడ్కర్


