● విచ్చలవిడిగా జూదాలు
● కోట్లల్లో చేతులు మారిన డబ్బు
● కనిపించని పోలీసులు
లింగాల : లింగాల మండలంలో దొండ్లవాగు, మురారిచింతల, పార్నపల్లె గ్రామాల్లో టీడీపీ నాయకులు విచ్చలవిడిగా జూదాలను నిర్వహింపజేశారు. లక్షలాది రూపాయలు బెట్టింగ్‌లు నిర్వహించి ఆటలను కొనసాగించారు. ఈ ఆటలు ఆడేందుకు అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వందలాది మంది జూద ప్రియులు తరలివచ్చారు. జూదం, కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గత శనివారం పోలీసులు డ్రోన్ కెమెరాలను చూపిస్తూ మరీ పల్లెల్లో ప్రచారం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడేమో వాటి జాడే లేకుండా పోయింది.మండలంలో ఎప్పుడు లేనివిధంగా విచ్చలవిడిగా జూదాలు ఆడటంపై ప్రజలు ఆశ్చర్యం.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.


