చికెన్ ధర అమాంతంగా...
సంక్రాంతి పండుగ అంటే అందరికీ ముఖ్యమే. ముఖ్యంగా మూడు రోజుల పండగలో భాగంగా చివరిరోజు కనుమ పండగకు దాదాపు ప్రతి ఒక్కరు మాంసాన్ని తింటారు, కానీ ఈ ఏడాది చికెన్ ధర రూ. 230 నుంచి ఏకంగా రూ. 300 పెరిగింది. ఇక మటన్ ధర చెప్పాల్సిన పనేలేదు. పండగకు మాంసం తినడం భారంగానే ఉంది. – మహేష్, కడప
బోగి భాగ్యాలు
కడప సెవెన్‌రోడ్స్ : సంక్రాంతి వేడుకల్లో భాగంగా బుధవారం కలెక్టర్ బంగ్లాలో బోగి పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కలెక్టర్ శ్రీధర్ సాంప్రదాయ దుస్తులు ధరించి తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బోగి మంటల వెచ్చ టి వెలుగులు ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్నారు. మకర సంక్రాంతి కాంతులతో ప్రతి ఇల్లు సంక్షేమ, సౌభాగ్యాలతో శోభాయమానంగా వెలుగొందాలని ఆకాంక్షించారు
కడప అగ్రికల్చర్ : సామాన్యులకు ఈ సారి సంక్రాంతి కాంతిని లేకుండా చేస్తోంది. నిత్యా వసర సరుకుల ధరలు బహిరంగ మార్కెట్‌లో జనాలకు దడ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా పిండి వంటలకు సంబంధించిన సరకులతో పాటు నూనెల ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వెన్ను లో వణుకు పుడుతోంది. సామాన్యుడి నుంచి స్థితిమంతుడి వరకు ప్రతి నిత్యం వినియోగించే నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతు న్నారు. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వా లు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో కిలో కొనుగోలు చేసే చోట అర కిలోను కొనుగోలు చేసి సర్దుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు కాలం వెళ్లదీయాలని సామాన్యు లు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు.
కాగుతున్న నూనె ధరలు
సంక్రాంతి పండగకు పిండివంటలను చేసుకుంటారు. కానీ ఈ ఏడాది అ పరిస్థితి సామాన్యులకు కరువైయింది. ఎందుకంటే నూనెధరలు సలసలకాగుతున్నాయి. దీంతో చాలా మంది పండివంటలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది పండగ సాంప్రదాయం కాబట్టి అరకొరగా పిండివంటలను చేసుకుని మమ అనిపించుకున్నట్లు తెలిపారు.
కొండెక్కిన కోడి.. మంటెక్కిన మటన్ ధర
కోడికూర ధర కొండెక్కి కూర్చుంది. మొన్నమొన్నటి వరకు కిలో రూ. 230 ఉన్న బ్రాయిలర్ చికెన్ కిలో ధర ఏకంగా మూడు వందలకు చేరింది. నాటు కోడి ధర కిలో రూ. 450 నుంచి 600 వందల వరకు ఉంది. డిమాండ్‌ను బట్టి ఇంకా ఎక్కువకు కూడా అమ్ముతున్నారు. ఇక మటన్ కిలో రూ.860 నుంచి రూ.1000 వరకు ఉంది. ఈ ధరల్లో మాంసాన్ని కూడా కొని తినే పరిస్థితి లేదు. కాకపోతే ఎంఽత ధర ఉన్నా ఈ పండగ ముఖ్యమైయింది కాబట్టి మాంసం తినే ప్రతి ఒక్కరు తప్పకుండా మాంసాన్ని తెచ్చుకుని పండగ చేసుకోవాల్సిన పరస్థితి.
సంక్రాంతి పండగ ఈ సారి సామాన్యులకు భా రంగా మారింది. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పండగ కళ తప్పుతోంది. ధరల నియంత్రణలో ప్రభు త్వం చొరవ తీసుకోవాలి. అలాగైతేనే సామాన్యులు బతకగలరు. లేకుంటే వారి జీవనం దుర్భరంగా మారుతుంది. – దస్తగిరిరెడ్డి,
ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి, కడప.
పెరిగిన ఽనిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులకు పండగ నిర్వహణ భారంగా మారింది. పండగకు సంబంధించిన ముఖ్య సరుకులతో పాటు నూనె ధరలు కూడా పెరిగాయి. దీంతో సామాన్యులకు పండగ నిర్వహణ కడు భారంగా మారింది.
– రాజశేఖర్‌రెడ్డి, ఆలంఖాన్‌పల్లి.
ధరల పెరుగుదల ఇలా..
సరుకుపేరు గత ఏడాది ఈ ఏడాది
కిలో ధర కిలో ధర
రూ.లలో రూ.లలో
కొబ్బెర 200 280
చింతపండు 100 180
పెసలు 120 124
చక్కెర 42 46
మినుములు 118 123
బెల్లం 62 66
నువ్వులు 150 155
పామాయిల్ 92 114
వేరుశనగ నూనె 145 160
సన్‌ప్లవర్ 133 152
సామాన్యులకు భారంగా
సంక్రాంతి పండుగ
దడ పుట్టిస్తున్న నిత్యావసరాల ధరలు
కొండెక్కిన కోడి మంటెక్కిన మటన్
చికెన్ ధర అమాంతంగా...
చికెన్ ధర అమాంతంగా...
చికెన్ ధర అమాంతంగా...
చికెన్ ధర అమాంతంగా...
చికెన్ ధర అమాంతంగా...
చికెన్ ధర అమాంతంగా...


