విభిన్న ప్రతిభావంతులకు సేవలు అభినందనీయం
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అందజేయడం ద్వారా చైన్నెకి చెందిన యాక్సెస్ హెల్త్ కేర్ అండ్ ఫ్రీడమ్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సభా భవనంలో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 6, 7 తేదీలలో 219 మంది కాళ్లు కోల్పోయిన విభిన్న ప్రతిభావంతులకు కొలతలు తీసుకున్నామన్నారు. వారందరికీ ఆధునిక కృత్రిమ కాలు ఒక్కొక్కటి రూ. 51000తో మొత్తం సుమారు రూ.67 లక్షలు విలువ చేసే ఆధునిక కృత్రిమ కాళ్లు అమర్చామన్నారు. వీరి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ సుందర్, యాక్సెస్ హెల్త్‌కేర్ ప్రతినిధి ఇలవేందన్, ట్రస్ట్ మెంబర్ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.
జాయింట్ కలెక్టర్ అదితి సింగ్


