‘మౌలానా’ అరెస్టు టీడీపీ కుట్ర!
కడప రూరల్: మౌలానా జాకీర్ హుస్సేన్‌ను కుట్రపూరితంగా అరెస్ట్ చేయించడంపై అఖిలపక్ష, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టు వెనక కూటమి నేతల కుట్ర ఉందని ఆరోపించారు. శనివారం కడప వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్‌ఖాన్, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, జేఏసీ కన్వీనర్ అహ్మద్‌బాబు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం దారుణమన్నారు. మతాల మధ్య విభజన పెంచి దేశ లౌకిక స్వభావాన్ని, మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మత గురువు మౌలానా జాకీర్ హుస్సేన్ గళం విప్పితే ఒక టెర్రరిస్ట్‌ను అరెస్ట్ చేసిన విధంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ పరిణామాల వెనుక టీడీపీ, బీజేపీల హస్తం ఉందని ఆరోపించారు. అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలను ఆపలేరని పేర్కొన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మౌలానా జాకీర్ హుస్సేన్‌పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం సవరించిన వక్ఫ్ చట్టంలో గణనీయమైన మార్పులు తేవడం తగదన్నారు. ముస్లింలు తమ మతాన్ని ఆచరించడానికి రాజ్యాంగం కల్పించిన హక్కులపై దాడి చేయడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2024ను వెనక్కి తీసుకోవాలని తెలిపారు. తాహిర్, సయ్యద్ సలావుద్దీన్, మక్బూల్‌బాషా, దస్తగిరి, న్యాయవాది అహ్మద్‌అలీ, ఖాన్‌అమీద్ తదితరులు పాల్గొన్నారు.
‘వక్ఫ్ బిల్లు’ను వ్యతిరేకిస్తే అరెస్టు చేస్తారా!
వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
సమావేశంలో అఖిలపక్ష,ప్రజా సంఘాల నేతల ధ్వజం


