
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం సమర్పిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ జిల్లాలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లె జాతీయ రహదారి పనులకు టెండర్లు పిలిచి ఆరు మాసాలు కావొస్తున్నా ఇంతవరకూ పనులు చేయలేదని, వెంటనే మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాకరాపేట నుంచి బద్వేల్ మీదుగా బెస్తవారిపేట వరకూ, పోరుమామిళ్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి