సాక్షి, అమరావతి : ఇటీవల హత్యకు గురైన వైఎస్సార్ జిల్లా బహులార్థ పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న మృతి శాఖాపరంగా తీరని లోటని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన సంతాప సభలో అచ్చన్న చిత్రపటానికి డైరెక్టర్‌తో సహా కార్యాలయ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అమరేంద్రకుమార్ మాట్లాడుతూ అచ్చన్న మృతి దురదృష్టకరమన్నారు.ఆయన్ని హత్య చేసిన వార్ని కఠినంగా శిక్షించాలన్నారు. అదనపు సంచాలకులు పి.సత్యకుమారి, డాక్టర్ ఎన్ రజవీకుమారి, వివిధ విభాగాధిపతులు, కార్యాలయ సిబ్బంది అచ్చెన్న మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
హత్య చేసిన వార్ని కఠినంగా శిక్షించాలి
పశుసంవర్ధక శాఖ అధికారులు