
సమావేశంలో మాట్లాడుతున్న ప్రతాప్‌రెడ్డి
కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి పరీక్షలకు సంబంధించి సమాధాన పత్రాల కోడింగ్ విషయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్, ఎఫ్‌ఏసీ ఆర్‌జేడీ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి సూచించారు. కడప నగరంలోని మానస ఇన్‌లో బుధవారం కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లకు, చీఫ్ కోడింగ్ అధికారులకు, అసిస్టెంట్ కోడింగ్ అధికారులకు మూల్యాంకనంపై శిక్షణా కార్యక్రమం జరిగింది. బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ జవాబు పత్రాలకు ఓఎంఆర్ ఆధారంగా కోడింగ్‌ను ఇవ్వాలన్నారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కడప డీఈఓ రాఘవరెడ్డి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జేడీ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్, సత్యనారాయణ, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.