చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా ఉన్న ఈ రద్దీ ఆదివారం మరింతగా పెరిగింది. వివాహాది శుభకార్యాలు, గ్రామదేవతల పండుగలు, వీకెండ్ కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించారు. దీనికి తోడు పలుచోట్ల రోడ్డు పనులు జరుగుతుండటంతో హైవేపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నెలకొంది. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేట, ధర్మోజిగూడెం, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా చోట్ల రోడ్డు ఇరుకుగా మారి వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధర్మోజిగూడెం నుంచి విజయవాడ మార్గంలో చౌటుప్పల్ వరకు ఉన్న కేవలం 5 కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు వాహనాలకు ఏకంగా అరగంట సమయం పట్టింది. చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డు నుంచి మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో ఉన్న ఎస్‌ఎంఆర్ ఫంక్షన్‌హాల్ వరకు వాహనాలు బారులుదీరాయి.
ఫ కిలోమీటర్ల మేర
స్తంభించిన వాహనాలు
ఫ శుభకార్యాలు, వీకెండ్
తోడవ్వడంతో పోటెత్తిన రద్దీ


