స్కూల్‌ పరీక్షల మూల్యాంకనంలో కొత్తవిధానం | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ పరీక్షల మూల్యాంకనంలో కొత్తవిధానం

Aug 31 2026 9:39 AM | Updated on Aug 31 2026 9:39 AM

భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు సమాధాన పత్రాలను దిద్ది మార్కులు వేసేవారు. ఇక నుంచి మూల్యాంకన ప్రక్రియ పదో తరగతి తరహాలోనే కొనసాగనుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌నికోలస్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

మండల కేంద్రాల్లో వాల్యుయేషన్‌ కేంద్రాలు

జిల్లాలో 715 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 45,296 మంది విద్యార్థులు చదువుతున్నారు. నూతనంగా అమలులోకి రానున్న ఎక్స్‌టర్నల్‌ వాల్యుయేషన్‌ విధానంలో భాగంగా సమాధాన పత్రాలు దిద్దేందుకు మండల కేంద్రాల్లో వాల్యుయేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మండల కేంద్రంలో పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులచే కాకుండా ఇతర ఉపాధ్యాయుల చేత కూడా దిద్దించనున్నారు. 1 నుంచి 9 తరగతులకు ఎస్‌ఏ–1 (అర్ధవార్షిక) ఎస్‌ఏ–2 (వార్షిక), పరీక్షలకు పదో తరగతికి ఎస్‌ఏ–1కు ఇది వర్తించనుంది. అదేవిధంగా 1 నుంచి 5వ తరగతుల సమాధాన పత్రాలను దిద్దేందుకు ఒక్కో పేపరుకు రూ. 2, 6నుంచి 10వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాలు దిద్దేందుకు రూ. 3 చెల్లించనున్నారు. అదేవిధంగా ఒక్కో ఎంఆర్‌సీకి రూ.10వేల చొప్పున ఇవ్వనున్నారు.

ఫ సమాధాన పత్రాలు దిద్దేందుకు మండలాల్లో వాల్యుయేషన్‌ కేంద్రాల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement