విద్యార్థులను మూతబడిన పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాం. మూతబడిన స్కూళ్లులో 10 నుంచి 15 మంది విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ అదర్శ కమిటీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే కొన్ని పాఠశాలలను తెరిపించాం. మరిన్ని స్కూళ్లను తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
– భిక్షపతి, డీఈఓ
భువనగిరి: విద్యార్థులు లేక (జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో) మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ జీవం పోసుకున్నాయి. విద్యాశాఖ అధికారుల ప్రత్యేక చొరవ, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమష్టి కృషితో పల్లెల్లోని సర్కారు బడులు తిరిగి తెరుచుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మిగిలిన బడులను కూడా ఈ విద్యా సంవత్సరంలో తెరిపించే దిశగా అధికార యంత్రాంగం బడిబాట ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
విద్యాశాఖ ప్రత్యేక దృష్టి
విద్యాశాఖ అధికారులు తయారు చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో 66 పాఠశాలలు జీరో ఎన్‌రోల్‌మెంట్‌గా ఉండటంతో గతంలో దశల వారీగా మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి మూతబడిన పాఠశాలలు తెరిపించాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అందరు కూడా కృషిచేస్తున్నారు.
బడిబాటతో..
జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బడిబాట నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్కారు అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫాం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ప్రత్యేక అభ్యసన దీపికల వంటి విషయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు కాకుండా స్థానికంగా ప్రభుత్వ బడులకే పంపాలని గ్రామపంచాయతీల్లో తీర్మానాలు సైతం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మూతబడిన పాఠశాలల్లో నాలుగు స్కూళ్లు తెరుచుకున్నాయి. ఆయా పాఠశాలల్లో 10 నుంచి 15 మంది విద్యార్థులు చేరారు.
ఫ జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో
మూతపడిన స్కూళ్లు 66
ఫ వీటిలో ఇప్పటివరకు నాలుగు
పాఠశాలలు పునః ప్రారంభం
ఫ సత్ఫలితాలిస్తున్న బడిబాట
ఫ ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమష్టి కృషి
జిల్లాలో ఇప్పటి వరకు తెరుచుకున్న ప్రాథమిక పాఠశాలలు
మండలం గ్రామం విద్యార్థుల సంఖ్య
బీబీనగర్ కొత్తతండా 10
నారాయణపురం కడపగండి 9
యాదగిరిగుట్ట తాళ్లగూడెం 8
మోటకొండూర్ తేర్యాల 14


