భువనగిరి: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చోంగ్తూ సూచించారు. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల కోసం నూతనంగా చేపట్టిన భవననిర్మాణ పనులతో పాటు జిల్లా కేంద్ర ఆస్పత్రిని గురువారం ఆమె పరిశీలించి మాట్లాడారు. మెడికల్, నర్సింగ్ కళాశాల్లో విద్యార్థులకు అందించాల్సిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అంతకు ముందు మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించి వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అన్ని వార్డులను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నవజాత శిశు సంరక్షణ, క్రిటికల్ కేర్ సెంటర్లను ఆమె తనిఖీ చేశారు. అనంతరం టీ హబ్‌ను పరిశీలించారు. టీ హబ్‌లో ఎంతమంది టెక్నికల్ సిబ్బంది ఉన్నారని, ఒకవేళ సిబ్బంది లేకపోతే వైద్య పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారని, సకాలంలో రోగులకు ఎలా రిపోర్టులు అందిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేందర్‌కుమార్, టీజీఎంఎస్‌ఐడీసీ చీఫ్ ఇంజనీర్ శశిధర్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ అరుణకుమారి, ప్రిన్సిపల్ లక్ష్మణ్‌రావు, డీఎంహెచ్‌ఓ మనోహర్, డీసీహెచ్‌ఎస్ సూర్యశ్రీరావు తదితరులు ఉన్నారు.
ముత్తిరెడ్డిగూడెంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలభవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న క్రిస్టినా
భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బాలింతతో మాట్లాడుతున్న క్రిస్టినా
ఫ రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ
సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
క్రిస్టినా జెడ్. చోంగ్తూ


