2,500 మంది సిబ్బంది..
భువనగిరి: ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వివిధ దేశాల నుంచి జిల్లాకు వలస వచ్చిన వారిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిర్దేశించిన రోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు సిబ్బంది ఈనెల 29,30 తేదీల్లో ఇళ్లకు వెళ్లి వేయనున్నారు. దీని కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
625 కేంద్రాలు
జిల్లాలోని 17 మండలాల పరిధిలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, జిల్లా కేంద్ర ఆస్పత్రి, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 427 గ్రామ పంచాయతీలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు 625 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 22 హై రిస్క్ కేంద్రాలు, 20 మొబైల్ బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులు 57,842 మంది ఉన్నట్లు గుర్తించారు.
ఫ 28న పల్స్ పోలియో
ఫ 625 కేంద్రాలు ఏర్పాటు
ఫ 57,842 మంది ఐదేళ్లలోపు
పిల్లలకు చుక్కలే లక్ష్యం
ఫ అందుబాటులో 62 వేల డోసులు
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. మొబైల్ బృందాల ద్వారా బస్టాండ్లు తదితర ప్రాంతాలలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికోసం 22 రూట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 64 మంది సూపర్‌వైజర్లను నియమించారు. జిల్లాలో 62వేల డోసులు అందుబాటులో ఉండగా 2,500 మంది సిబ్బంది విధులు నిర్వహంచున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ సూచించారు.


