కనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు గురువారం ఉదయం గవ్యాంత పూజలు, 108 కలశములతో అష్టోత్తర శతఘటాభిషేకం, నిత్యోపాసన, బలిహరణ త్రిశూల స్నానం, నీరాజన మంత్రపుష్పములు తదితర పూజలు జరిపించారు. సాయంత్రం దర్వేశిపురం, పర్వతగిరి గ్రామస్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. రాత్రి ఏకాంత సేవ, నీరాజన మంత్రపుష్పాములతో జాతర ముగిసిందని ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి తెలిపారు. ఆయా పూజా కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ రాయల శేఖర్, కార్యదర్శి దేవిరెడ్డి పద్మ, మాజీ చైర్మన్ కంచరకుంట్ల గోపాల్‌రెడ్డి, ధర్మకర్తలు కె. శంకర్ రెడ్డి, ఎం. గణేష్ మోహన్, కె. పరమేష్, ఎన్. యాదగిరి, యూ. మహేష్, జి. సైదులు, పి. సత్యనారాయణ, కే. శ్రీను, ఎం. రమణ, ఎన్. వెంకన్న, ఎన్. తిరుపతయ్య, ఎన్. వెంకటేశ్వర్లు, సీహెచ్. రమేష్, అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రావణ్‌కుమారాచార్యులు, గాదె దామోదర్‌రావు, జి.ఉమామహేశ్వరరావు, శ్రీనివాస్‌చారి, అవ్యయ్ కుమార్, నాగరాజు, ఆలయ సిబ్బంది చంద్రయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్‌రెడ్డి, ఆంజనేయులు, నాగరాజు, రాజయ్య, శ్రీకర్, రవి తదితరులు పాల్గొన్నారు.
త్రిశూల స్నానం ఊరేగింపు నిర్వహిస్తున్న పూజారి మల్లాచారి
బోనాలు సమర్పించిన భక్తులు


