వీరత్వానికి ప్రతీక.. సర్వాయి పాపన్న | - | Sakshi
Sakshi News home page

వీరత్వానికి ప్రతీక.. సర్వాయి పాపన్న

Jun 26 2026 7:39 AM | Updated on Jun 26 2026 7:39 AM

తుంగతుర్తి : మొగలుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గోల్కొండ కోటను పాలించిన సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ తెలంగాణ వీరత్వానికి ప్రతీక అని బీసీ కమిషన్‌ సభ్యురాలు బాలలత, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు కోతి కిషోర్‌, జై గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు రామారావు అన్నారు. తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో గౌర సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన విప్లవ వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని గురువారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. సర్దార్‌ సర్వాయి పాపన్న తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చిలకల మంజులవెంకన్న, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ చింతకుంట్ల వెంకన్న, విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడు కోతి యాకన్న, విగ్రహ దాత తాళ్లపల్లి యాదగిరి, గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు అంజిబాబు, గుండగాని రాములు గౌడ్‌, పాలకుర్తి రాజయ్య గౌడ్‌, కోతి ఆలియా, బహుజన ఉద్యమ నేత మానుకోట ప్రసాద్‌, మద్దెల సందీప్‌, పాలకుర్తి శ్రీకాంత్‌, కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు నరసయ్య, ప్రధాన కార్యదర్శి చిర్ర నరేష్‌, విగ్రహ కమిటీ సభ్యులు బొమ్మగాని వెంకన్న, ముత్యం యాకయ్య, ముత్యం అనిల్‌, మల్లయ్య, గౌడ, వివిధ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

బీసీ కమిషన్‌ సభ్యురాలు బాలలత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement