కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

భువనగిరి: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు జెడ్పీ సీఈఓ శోభారాణి పేర్కొన్నారు. బుధవారం భువనగిరి మండలంలోని తాజ్‌పూర్‌ ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్‌ ర్యాకల సంతోషశ్రీనివాస్‌ రూ. 16లక్షల సొంత ఖర్చులో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌, ఎల్‌ఈడీ డిజిటల్‌ క్లాస్‌ స్క్రీన్‌, వైఫై, సీసీకెమెరాలు, మూత్రశాలలు, ప్యూరిఫైడ్‌ వాటర్‌ ఫిల్ట ర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. డీఈఓ భిక్షపతి మాట్లాడుతూ గ్రామసర్పంచ్‌ సొంత ఖర్చులతో పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు. సర్పంచ్‌ ర్యాకల సంతోషశ్రీనివాస్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలన్నారు. అంతకుముందు కళాకారులు పాడిన పాటలు, విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అవెజ్‌ చిస్తీ, ఎంఈఓ రంగరాజ్‌, సామాజిక వేత్త డాక్టర్‌ ర్యాకల శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ ఓరుగంటి కృష్ణ, వార్డు సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement