మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో మూడో విడత అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో మూడో విడత అడ్మిషన్లు

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

భూదాన్‌పోచంపల్లి : భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్‌ముఖిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను మూడో విడత అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ కె. శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్‌ పాసైన విద్యార్థులు ఈ నెల 27, 29, 30వ తేదీల్లో ఏదో ఒక రోజు ఉదయం 6 గంటల వరకు కళాశాలలో నేరుగా తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆమె సూచించారు. ఫిజికల్‌, మెడికల్‌ టెస్ట్‌లతో పాటు రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. శారీరక సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా ట్రాక్‌ సూట్‌, షూస్‌ ధరించి రావాలని అన్నారు. విద్యార్థుల కనీస ఎత్తు 152 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని, కంటి దోషాలు, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదని తెలిపారు. మరిన్ని వివరాలకు 79950 10687 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement